Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న చిత్రం 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్‌పై ఈ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బాలకష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించింది. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు తమన్ మంగళవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
బోయపాటి శ్రీను, బాలకష్ణ గారి అండర్ స్టాండింగ్ చాలా గొప్పది. వారిద్దరూ కలిసి ఎన్ని వందల సినిమాలు చేసినా ఫ్లాప్ అవ్వవు. ఈ సినిమాలో ఫైర్ ఉంది. అలాగే ఎమోషనూ బాగుంటుంది. ఎమోషన్ బాగుంటే సినిమాలెప్పుడూ హిట్టే. ఈ విషయంలో బాలయ్య గారు అదరగొట్టేశారు. ఇది అందరికీ పర్ఫెక్ట్ మీల్స్‌లాంటి సినిమా.
ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం కోసం అఘోర పాత్రల మీద రీసెర్చ్ చేశాను. సినిమాలో అఘోర పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో రేంజ్ మారిపోతోంది. వేరే జోన్లో ఉంటుంది. ఆ పాత్రలకు తగ్గట్టుగానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాను. చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకి దాదాపు ఐదారు వందల మంది పని చేశారు. చాలా ప్రయోగాలు చేశాం. కేవలం సింగర్లే 120 మంది వరకు ఉంటారు.
అఘోర అంటేనే సైన్స్. వాళ్లు అలా ఎందుకు మారుతారు? అనే విషయాలపై సినిమా ద్వారా క్లారిటీ వస్తుంది. దేవుడిని ఎందుకు నమ్మాలి అనే దాన్ని క్లియర్‌గా చూపిస్తారు. సినిమా చూసి మా టీం అంతా కూడా చాలా హైలో ఉన్నాం. ఈ కథ నెవ్వర్ బిఫోర్ అని, నెవ్వర్ అగైన్ అని కూడా చెప్పొచ్చు. టైటిల్ సాంగ్ విని బాలయ్య మెచ్చుకున్నారు. కమర్షియల్ సినిమాలకు త్వరగా ఏజ్ అవుతుంది. కానీ బోయపాటి గారు ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు.
మా మ్యూజిక్‌ని జనాల్లోకి తీసుకెళ్లేదే హీరోలు. వారి వల్లే అందరికీ రీచ్ అవుతుంది.బాలయ్యతో తదుపరి చిత్రాన్ని కూడా చేస్తున్నాను. ఆయన సైన్స్‌ను నమ్మే వ్యక్తి. టైంను ఎక్కువగా నమ్ముతారు. ఎంతో లవ్లీ పర్సన్.
నిర్మాత రవీందర్‌రెడ్డి సినిమాపై ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో తెలిసిన వారు కూడా. అయితే నేను కూడా సినిమాకి ఏం కావాలో అది చేస్తాను. ఎక్కువ ఖర్చు అనేది నేను అంగీకరించను. ఒక్కో పాటకు ఒక్కోలా చేయాల్సి ఉంటుంది. శంకర్ మహదేవన్ పాడితే బాగుంటుందని అనుకుంటే, ఆయనతోనే పాడిస్తాం. అంతే కానీ ఖర్చు తక్కువ అవుతుందని వేరే వాళ్లతో పాడించను.
ఇలాంటి జోనర్లో ఇదే నా బెస్ట్ వర్క్ అవుతుంది. కమర్షియల్ సినిమా అంటే అన్నీ స్పైసీగా ఉండాలి. కానీ ఇలాంటి చిత్రాలకు అది కుదరదు. టైటిల్ సాంగ్‌ను కంపోజ్ చేసేందుకు దాదాపు ఓ నెల రోజులు పట్టింది. గొప్ప సన్నివేశం తర్వాత ఆ పాట వస్తుంది. డైరెక్టర్ కథ చెప్పేటప్పుడే మాకు ఇన్స్పైరింగ్గా ఉంది. పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లుంటే మాకు కూడా మంచి ఊపు వస్తుంది. ఇందులో శ్రీకాంత్, జగపతి బాబు గారు అద్భుతంగా నటించారు.