Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '1997'. డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం ఈ నెల 26న గ్రాండ్‌గా విడుదల అవుతోంది.
ఈ సందర్బంగా నటుడు, దర్శకుడు, నిర్మాత డా|| మోహన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 'ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ కథ. నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ఇందులో ఒక అమ్మాయిని రేప్ చేసిన తరువాత ఆమె పడే మానసిక వేదన, ఆమె తల్లి తాలూకు ఎమోషన్ ఎలా ఉంటుంది?, అలాగే కామవాంఛ తీర్చుకోవడానికి చాలా మార్గాలుండగా, అమ్మాయిలను రేప్ చేసి, చంపటం ఎందుకు?, కుల వివక్ష.. వంటి తదితర అంశాలూ ఇందులో ఉంటాయి. మా తాతగారు చెప్పిన కథ ఇది. అప్పటినుండి ఈ కథ నా మైండ్‌లో అలా ఉండిపోయింది. ఈ కథను తెరపై ఆవిష్కరించాలనే ఉద్దేశంతోనే సినిమాగా తీసాను. ఇలాంటి సంఘటనలను ప్రజలకు చెప్పాలన్నదే ప్రయత్నమే. ఈ సినిమా చూసి సెన్సార్ వాళ్ళు అప్రిసియేట్ చేసారు. చాలా బాగుంది. మంచి పాయింట్‌తో తీశారన్నారు. మహిళా సభ్యులైతే కన్నీళ్లు పెట్టించారని అన్నారు. ఇందులో నేను ఐపీఎస్ పాసై అప్పుడే ఉరికి వెళ్లిన పోలీస్ అధికారిగా కనిపిస్తాను. ఊర్లలో జరుగుతున్న ఈ సంఘటనలను ఆపేందుకు ప్రయత్నం చేసే పోలీస్. అని రకాల షేడ్స్ ఉంటాయి. నాకు కోటిగారితో మంచి పరిచయం ఉంది. ఈ కథ అయన విని, సినిమా చూశాక చాలా గొప్పగా తీశావని మెచ్చుకుంటూ సంగీతం అందించారు. అయన ఆర్ఆర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అలాగే 'ఏమి బతుకు..' సాంగ్ మంగ్లీ పాడింది. అది 8 మిలియన్ వ్యూస్ వరకు వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో నవీన్ చంద్ర నా పై అధికారిగా కనిపిస్తాడు. అద్భుతంగా చేసాడు. ఇక శ్రీకాంత్ అయ్యంగార్ చారి అనే పోలీస్‌గా అదరగొట్టాడు. నాకు ఏ పని చేసిన అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి చేయడం ఇష్టం. ఈ సినిమా విషయంలో నటుడిగా, దర్శకుడిగా నాకు రెండు సంతప్తి ఇచ్చాయి' అని తెలిపారు.