Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం 'థ్యాంక్యూ'. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెకంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బి.వి.ఎస్.రవి కథ, మాటలను అందించారు. రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ కథానాయికలుగా నటిస్తున్నారు. మంగళవారం హీరో నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ సందర్భంగా నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ, 'నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా మా 'థ్యాంక్యూ' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకు నాగచైతన్య చేయనటువంటి ఓ వైవిధ్యమైన పాత్రను ఈ సినిమాలో చేస్తున్నారు. యాక్టర్‌గా ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిదని కచ్చితంగా, నమ్మకంగా చెప్పగలం. బి.వి.ఎస్.రవి అందించిన అద్భుతమైన కథను డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్‌గారు మరింత గొప్ప సినిమాగా మలిచారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్, ఎడిటర్ నవీన్ నూలి .. ఇలా ఓ బెస్ట్ సినిమాని అందించడానికి బెస్ట్ టీమ్ వర్క్ చేసింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన వివరాలను తెలియజేస్తాం' అని చెప్పారు.ఈ చిత్రానికి సహ నిర్మాత : హర్షిత్ రెడ్డి.