Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీకాంత్, హ్రితిక జంటగా నటించిన చిత్రం 'లాక్డౌన్' (ద పాండమిక్). ఈ సినిమా విడుదలకు సిద్ధమైన సందర్భంగా ప్రతాని రామకష్ణ గౌడ్ మాట్లాడుతూ,'దర్శకుడిగా సిరాజ్ ఈ లవ్, సస్పెన్స్ థ్రిల్లర్‌ను చాలా చక్కగా డీల్ చేశాడు. నిర్మాతగానే కాకుండా దర్శకుడిగానూ ఈ సినిమాతో ఆయన సక్సెస్ అవ్వాలి' అని అన్నారు.
'మా దర్శక, నిర్మాత సిరాజ్ మంచి సినిమా తీశారు. సినిమా అవుట్‌ఫుట్ చాలా బాగా వచ్చింది. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన సిరాజ్‌గారికి కృతజ్ఞతలు' అని హీరో, హీరోయిన్ శ్రీకాంత్, హ్రితిక తెలిపారు.
దర్శక, నిర్మాత సిరాజ్ మాట్లాడుతూ,'నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాలను ఆదరించినట్టే, ఇప్పుడు దర్శకుడిగా తీసిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. లాక్డౌన్లో ఏం జరిగిందనే ఆసక్తికర అంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని డిసెంబర్ మొదటి వారంలో థియేటర్లతోపాటు ఓటీటీలోనూ విడుదల చేయబోతున్నాం' అని చెప్పారు.