Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంపూర్ణేష్‌బాబు తాజాగా నటించిన చిత్రం 'క్యాలీ ఫ్లవర్'. 'శీలో రక్షతి రక్షిత:' అనేది ఉపశీర్షిక. గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకష్ణా టాకీస్ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని దర్శకుడు. ఈనెల 26న ఈ సినిమాని థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
ఈ సందర్భంగా సంపూర్ణేష్‌బాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ, 'ఇందులో ద్విపాత్రాభినయం చేశాను. ఒక పాత్రకు ఆండ్రిఫ్లవర్..రెండో పాత్రకు క్యాలీఫ్లవర్ అనిపెట్టారు. శీలం అనేది ఆడవాళ్లకే కాదు. మగవాళ్లకు కూడా ముఖ్యం. అది కనుక పాటిస్తే ప్రపంచంలో ఎలాంటి సమస్యలు ఉండవు అని దర్శకుడు చెప్పిన పాయింట్ చాలా నచ్చింది. 'కొబ్బరిమట్ట'లో చెప్పినట్టుగా భారీ లెంగ్తీ డైలాగ్స్ ఉండవు. కోర్ట్ సీన్లో మాత్రం అలాంటి డైలాగ్స్ ఉంటాయి. హీరో రేప్‌కు గురవ్వడం, ఆ తరువాత వచ్చే పాటలు ఇలా అన్నీ బాగుంటాయి. అందరూ ఎంజారు చేస్తారు. నేను ఎంత అతి చేసినా ప్రేక్షకులు ఆదరిస్తారు. దాన్ని దష్టిలో పెట్టుకునే అందరూ కథలు రాస్తున్నారు. నటుడిగా ఏ పాత్ర చేయడానికైనా రెడీ. ప్రస్తుతం హీరోగా ఐదు సినిమాలు చేస్తున్నాను. వీటిల్లో తమిళంలో హీరోగా చేస్తున్న సినిమా ఇప్పటికే 70 శాతం పూర్తయింది. స్టోరీ బేస్డ్ సినిమా. సీరియస్‌గా సాగుతుంది' అని చెప్పారు.