Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్, ధవిక జంటగా నటిస్తున్న చిత్రం 'భగత్ సింగ్ నగర్'. వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈనెల 26న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా జరిపారు. ఈవెంట్లో పాల్గొన్న అతిథులు ఈ చిత్ర బిగ్ టికెట్‌ను, థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా హీరో విదార్ధ్ మాట్లాడుతూ, 'భగత్ సింగ్ చెప్పినట్టు ఏదైనా జరిగితే రెస్పాండ్ అవడం లాంటి కాన్సెప్ట్ తీసుకుని ఈ సినిమా చేశాం. అందరికీ న్యాయం చేయలేం. కానీ మనకు వీలైనంత వరకు మేలు చెయ్యాలనే విషయాన్ని ఈ సినిమాలో చూపించాం. సినిమా చాలా బాగా రావడానికి మా నిర్మాత రమేష్ ఉడుత్తు కారణం' అని చెప్పారు. 'ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు' అని హీరోయిన్ ధృవిక అన్నారు.
దర్శకుడు వలజా క్రాంతి మాట్లాడుతూ,'నేనొక మనిషిని.. మానవత్వానికి ఎలాంటి హాని కలిగినా నేను స్పందిస్తాను అని భగత్‌సింగ్ అన్న మాటలే మా చిత్రానికి స్ఫూర్తి' అని తెలిపారు. 'ఈ చిత్రంలో హీరోగా, దర్శకుడిగా మా ఇద్దరబ్బాయిలూ చేస్తున్నారు. మావారు కూడా నటించారు. కొత్త కథాంశంతో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుంది' అని నిర్మాత వలజా గౌరి చెప్పారు.
'మంచి మెసేజ్ ఉన్న ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం' అని మరో నిర్మాత రమేష్ ఉడుత్తు తెలిపారు.