Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్‌పై ఈ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించారు. బాలకష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నాయికగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత మిర్యాల రవిందర్ రెడ్డి బుధవారం మీడియాతో సంభాషించారు. ఆ విశేషాలు..
కరోనా కష్టాలను దాటుకుని..
కరోనా రాక ముందే ఈ సినిమాని ప్రారంభించాం. కరోనా సమయంలో టీజర్ విడుదల చేశాం. ఫస్ట్ లాక్డౌన్ అయ్యాక చిత్రీకరణ చేశాం. సెకండ్ లాక్డౌన్లో మరో టీజర్‌ని రిలీజ్ చేశాం. సెకండ్ లాక్డౌన్ తరువాత క్లైమాక్స్‌ని చిత్రీకరించాం. అన్ని కరోనాల తరువాత ఫైనల్‌గా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం.
పూర్వ వైభవం రావడం ఖాయం..
ఈ సినిమాకీ ఓటీటీల నుంచి కూడా బంపర్ ఆఫర్లు వచ్చాయి. ఒక పెద్ద సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తే రెవెన్యూ, రెస్పాన్స్ ఎలా ఉంటుందనే అనుమానం అందరికీ ఉన్నాయి. అయినప్పటికీ మేం ముందడుగు వేశాం. ఈ సినిమాకి వచ్చే రెస్పాన్స్ చూస్తే కరోనా లేదని అనుకుంటారు. థియేటర్లకి, పరిశ్రమకి మళ్లీ పూర్వ వైభవం వస్తుంది.
ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది
కంటెంట్ పరంగానే కాకుండా సినిమా ప్రారంభమైన 20 నిమిషాల తరువాత నుంచి చివరి వరకు అలా చూస్తుండిపోతారు. విజువల్ వండర్‌గా ఉంటుంది. అఖండ అంటే అనంతం.. కాదనలేని సత్యం. సినిమా చూశాక.. ఆ టైటిల్ ఎందుకు పెట్టారా? అని తెలుస్తుంది. కథకు టైటిల్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో రెండు పాత్రలు అని చూడకూడదు. ఆ రెండో పాత్ర సూపర్ మ్యాన్. మనిషికి ఎక్కువ దేవుడికి తక్కువ. సూపర్ హీరో. అఘోరాలు అంటే సమాజానికి సంబంధం లేని వ్యక్తులు కాదు. వారు వ్యక్తిగతం కన్నా.. దైవం, ప్రకతి వాటిపై రియాక్ట్ అవుతుంటారు. అలాంటి క్యారెక్టర్ వచ్చి, సమస్యలను పరిష్కరించడమనేది కథ.
వాళ్ళిద్దరి కెరీర్లోనే భారీ స్థాయి థియేటర్లు..
బోయపాటి, బాలకష్ణ గారి కెరీర్లో భారీగా థియేటర్లలో విడుదలవుతున్న సినిమా ఇదేనేమో. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్లలోను, అలాగే ఓవర్సీస్లోనూ భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం. మెల్బోర్న్లో అయితే బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటకే ఫుల్ అయిపోయాయి. 'లెజెండ్' సినిమాతో జగపతి బాబు కెరీర్ ఎలా టర్న్ తీసుకుందో, ఈ సినిమాతో శ్రీకాంత్ కెరీర్ టర్న్ అవుతుంది. ఈ చిత్రంలోనూ జగపతి బాబు సినిమాని గైడ్ చేసే ఇంపార్టెంట్ రోల్ పోషించారు. హీరోయిన్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా ఇచ్చి ఇలా వెళ్లే పాత్ర కాదు.