Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన వినోదాత్మక చిత్రం 'అనుభవించు రాజా'. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మించింది. సుప్రియ యార్లగడ్డ నిర్మాత. ఈ సినిమా ఈనెల26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం..
ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇంతకు ముందు చేసిన వాటితో పోల్చుకుంటే ఇంకాస్త హైపర్‌గా ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్ అవ్వాలంటే వెనకాల ఇంత ప్రాసెస్ ఉంటుందా? అనేది చూశాక, సెక్యూరిటీ గార్డ్ అంటే ఈజీ కాదని తెలిసింది.
దర్శకుడు శ్రీనుతో 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' చేశా. అప్పటికీ ఇప్పటికీ అతనిలో ఎంతో మెచ్చ్యూరిటీ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియో లాంటి బ్యానర్లో తనకి టాలెంట్ చూపించేందుకు అవకాశం దొరికింది.
భీమవారం స్లాంగ్, అక్కడి పాత్రలు నాకు బాగా సూట్ అవుతాయి. వాటిలో నేను సులభంగా ఇమడగలను. కొత్త పాత్రలు ట్రై చేశాను. కానీ వర్కవుట్ అవ్వలేదు. ఈ సినిమా భీమవరం, హైదరాబాద్ నేేపథ్యంలో సాగుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కలిసి చూసేలానే ఇందులో హీరోయిన్‌తో రొమాన్స్ ఉంటుంది. అమ్మిరాజు పాత్రలో అజరు గారు అద్భుతంగా నటించారు. గోపీ సుందర్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు.
నాగచైతన్యగారు ఈ సినిమా చూశారు. ఆయనకి బాగా నచ్చింది. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. తండ్రీ కొడుకుల సెంటిమెంట్, ఊరికి సంబంధించిన ఎమోషన్లు స్ట్రాంగ్‌గా ఉంటాయి. క్లాస్ పీకినట్టుగా మెసేజ్ ఉండదు. కానీ అంతర్లీనంగా మెసెజ్ ఉంటుంది.
కోడి పందెలు చూస్తాను. కానీ బెట్టింగ్ పెట్టను. ఈ సినిమా సంక్రాంతి పండుగ నుంచి మొదలవుతుంది. అక్కడి పండుగ వాతావరణాన్ని చూపిస్తాం. కోడి పందెల్లో ఎన్నో రకాల కోళ్లు ఉంటాయి. ఈ సినిమాలో వాడిన కోడి నాకు బాగా అలవాటైంది.
ప్రస్తుతం 'స్టాండప్ రాహుల్', 'మాస్ మహారాజా' చేస్తున్నాను. హైదరాబాద్‌కి ఎలా రావాలో కూడా తెలీదు. అలాంటిది ఇక్కడకి వచ్చి, 14 సినిమాలు చేశాను. ఇంకో సినిమా రెడీగా ఉంది. మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇంత కంటే గొప్ప అదష్టం ఇంకేం కావాలి?, ఇక్కడ ఓ సినిమా హిట్ కొట్టిన తరువాత వేరే భాషలో ట్రై చేస్తాను. అలాగే డేట్లు సర్దుబాటు అయితే కచ్చితంగా వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తాను.