Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా కారణంగా సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ఆయన్ని రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీని నిమిత్తం చికిత్సకు అవసరమయ్యే డబ్బుని సర్దుబాటు చేయడంలో శివశంకర్ కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బుధవారం రాత్రి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. ఇది తెలుసుకున్న నటుడు సోనూసూద్ వెంటనే స్పందించి, ఆయన ప్రాణాలను రక్షించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. శివశంకర్ మాస్టర్ గత నాలుగు రోజుల నుంచి హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన సతీమణి, పెద్దకుమారుడికి సైతం వైరస్ సోకింది. శివ శంకర్ కుమారుడు అపస్మారక స్థితిలో ఉండగా, సతీమణి హోం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు.