Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని కథానాయకుడిగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న చిత్రం 'శ్యామ్ సింగ్రారు'. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇందులోని 'ఏదో ఏదో..' అంటూ సాగే సెకండ్ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. నాని, కృతి శెట్టిపై తెరకెక్కించిన ఈ మెలోడి సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'టైటిల్ సాంగ్‌తో ఆకట్టుకున్న మిక్కీజేమేయర్ ఈ పాటతోనూ అందర్నీ మెస్మరైజ్ చేశారు. కష్ణ కాంత్ రాసిన ఈ పాటను, చైత్ర అంబడిపుడి ఆలపించారు. మెలోడి ట్యూన్, అద్భుతమైన గాత్రం, ఆకట్టుకునే సాహిత్యంతో పాటు నాని, కతి శెట్టిల రొమాన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ పాటలోని లిప్ లాక్ యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ వెరైటీ ట్యూన్స్ ఇవ్వడంతో మిక్కీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందించారు. ఈ చిత్రం దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ డిసెంబర్ 24న విడుదల కానుంది' అని చెప్పారు.