Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబి నేషన్‌లో రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై దానయ్య డీవీవీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రమిది. ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ఈ చిత్రంలోని 'జనని' అనే పాటను నేడు (శుక్రవారం) చిత్ర బృందం విడుదల చేయనుంది.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని దేశభక్తిని చాటే విధంగా తెరకెక్కిన ఈ పాటను గురు వారం ఉదయం 'ఆర్ఆర్ఆర్' టీమ్ పాత్రికేయుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించింది.
ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, ''జనని' పాట 'ఆర్ఆర్ఆర్' సినిమాకి ఓ సోల్. ఈ సినిమాలో ఉన్న అన్ని రకాల ఎమోషన్లకి, సీక్వెన్స్‌లకు ఇది ఆత్మలాంటిది. ఈ పాట కోసం అన్నయ్య కీరవాణి రెండు నెలలు శ్రమించారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్ కూడా రాశారు. డిసెంబర్ మొదటి వారంలో ట్రైలర్ విడుదల చేస్తాం. సినిమా ప్రమోషన్స్ భారీగానే ప్లాన్ చేశాం. 'ఆర్ఆర్ఆర్' టీమ్ మొత్తం త్వరలోనే మీ ముందుకు వస్తాం. మీ ప్రశ్నలన్నింటికీ మేం సమాధానం చెబుతాం' అని తెలిపారు.