Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్‌పై ఈ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా ఇందులో ప్రతినాయకుడిగా నటించిన శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ, 'కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేశాను. సక్సెస్ అయ్యాను. తర్వాత హీరోగా చేసి, మధ్యలో మళ్లీ విలన్‌గా చేశాను. బాలయ్య బాబు 'అఖండ' కోసం ప్రతినాయకుడి పాత్ర గురించి బోయపాటిగారు చెప్పగానే, భయపడ్డాను. వరదరాజులు కారెక్టర్‌కు న్యాయం చేయగలనా? అని అనిపించింది. ఎందుకంటే బాలయ్య, బోయపాటి సినిమాలో విలన్ అంటే మామూలుగా ఉండదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. కొత్త శ్రీకాంత్ కనిపిస్తాడు. నాక్కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. వరదరాజులు పాత్ర చాలా బాగా వచ్చింది. బాలయ్యతో 'శ్రీరామరాజ్యం' సినిమాలో నటించాను. అందులో లక్ష్మణుడి పాత్రలో తమ్ముడిగా కనిపిస్తే, ఇందులో రావణాసురుడి పాత్రలో కనిపిస్తాను. ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమా తరువాత బోల్డెన్ని అవకాశాలు వస్తాయి. ఏది పడితే అది ఒప్పుకోకు. సబ్జెక్ట్‌లు నేను చెబుతానని బాలకష్ణ అనేవారు. అయితే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే టెన్షన్ ఉంది. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఇటు ఇండిస్టీలో, అటు ఆడియెన్స్‌లో అంచనాలుంటాయి. ముఖ్యంగా ఇందులో డైలాగ్స్ అద్బుతంగా ఉంటాయి. బాలయ్య దగ్గరి నుంచి ప్రేక్షకులు కోరుకునేదే ఇది. ఇందులో సెంటిమెంట్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది హెవీ హై ఓల్టేజ్ సినిమా. ప్రకృతితో ఎలా ఉండాలి?, ఎలా పోరాడాలనే విషయాలుంటాయి. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ సినిమాలోనూ ఓ పాత్రను పోషిస్తున్నాను. అలాగే పునీత్ రాజ్ కుమార్ సినిమాలో విలన్‌గా నటించాను' అని చెప్పారు.