Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుదేవా, రెజీనా, అనసూయ కాంబినేషన్లో రాబోతోన్న చిత్రం 'ఫ్లాష్ బ్యాక్'. గుర్తుకొస్తున్నాయి అనేది ఉప శీర్షిక. అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్ మీద పి.రమేష్ పిళ్లై ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. డాన్ సాండీ దర్శకుడు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏ.ఎన్. బాలాజీ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. లేటెస్ట్గా ఈ చిత్రానికి సంబంధించి రెండు పోస్టర్లను డైరెక్టర్ కళ్యాణ్ కష్ణ కురసాల రిలీజ్ చేశారు. 'ఈ చిత్రం యూత్‌ను బాగా ఎట్రాక్ట్ చేస్తుంది. ఇందులో హై ఎమోషన్స్ ఉంటాయి. అంతకు మించి కథని చెప్పే విధానం బాగుంటుంది. టైటిల్, ట్యాగ్‌లైన్‌తోనే సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. సినిమాలోని ప్రతీ సీన్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో రెజీనా ఆంగ్లో ఇండియన్ టీచర్ పాత్రలో కనిపిస్తుండగా, అనసూయ మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ రెండు పాత్రలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రభుదేవా పాత్ర చాలా కొత్తగా ఉండబోతోంది. అద్భుతమైన స్టోరీకి కమర్షియల్ హంగులు జోడించి తెరకెక్కించిన చిత్రమిది. ఇది వరకు ఎన్నడూ కూడా ప్రేక్షకుల పొందని సరికొత్త అనుభూతిని ఈ చిత్రంతో పొందటం ఖాయం. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం' అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం : శ్యామ్ సీఎస్, పాటలు : చల్లా భాగ్యలక్ష్మీ, అనిరుధ్ శాండిల్య, డైలాగ్స్ : నందు తుర్లపాటి.