Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ నటుడు గౌతమ్ రాజు తనయుడు కృష్ణగౌతమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'కఠారి కృష్ణ'. నూతన దర్శకుడు ప్రకాష్ తిరుమల శెట్టి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నాగరాజు తిరుమల శెట్టి, పి.ఎ.నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, క్లీన్ యు సర్టిఫికెట్తో ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, ''మా' నూతన అధ్యక్షుడు మంచు విష్ణు విడుదల చేసిన పోస్టర్‌కి బ్రహ్మాండమైన స్పందన లభించింది. అలాగే మురళీ మోహన్ రిలీజ్ చేసిన ట్రైలర్‌కి, తనికెళ్ళ భరణి, గౌతమ్ రాజు, రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్‌తో రిలీజ్ చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని యూ ట్యూబ్ ఛానెల్స్‌లో కలిసి ట్రైలర్ పది మిలియన్ వ్యూస్ దాటిపోయే దిశగా సందడి చేస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రెండు మిలియన్ వ్యూస్ సాధించి ఈ చిత్రానికి ఉన్న క్రేజుని మరింత పెంచింది. ట్రైలర్‌కు లభిస్తున్న స్పందన చిత్ర విజయంపై తమకి ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతోందని దర్శక, నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 10న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని తెలిపారు.
కృష్ణగౌతమ్, చాణక్య, రేఖా నిరోషా, యష్నా చౌదరి, స్వాతి మండల్, పోసాని కష్ణ మురళి, మిర్చి మాధవి, చంద్రశేఖర్ తిరుమలశెట్టి, మధుబాబు, మహేష్ నందా, ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈచిత్రానికి పాటలు: మాచెంద్ర, దొరబాబు, సంగీతం: పద్మనాభవ్ భరద్వాజ్, ఎడిటింగ్: ఆలోషియస్, కెమెరా: ఆర్య, మనీష్ దివాన్, మాటలు : శివమణి.