Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భిన్న పాత్రలు, వైవిధ్యమైన చిత్రాలతో కథానాయికగా సమంత తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని, ప్రత్యేక అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న సమంత ఇకపై హాలీవుడ్‌లోనూ మెరవబోతున్నారు. హాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తూ ఆమె 'అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. గతంలో సమంతతో 'ఓ బేబీ' చిత్రాన్ని నిర్మించిన సునీత తాటి ఈ సినిమాని గురు ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'డౌన్‌టౌన్ అబ్బే' ఫేమ్ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తుండగా, నిమ్మి హరస్గమ కో రైటర్‌గా పని చేస్తున్నారు. సమంత ప్రస్తుతం నటిస్తున్న 'శాకుంతలం', 'కాతువక్కుల రెందు కాదల్' చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అలాగే ఈ ఏడాది ఆరంభంలోనే 'ఫ్యామిలీ మ్యాన్-2'తో మంచి సక్సెస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.