Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిఎల్ఎన్ మీడియా పతాకంపై రమణ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం 'పాయిజన్'. రవిచంద్రన్ దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఏఎంబీ మాల్లో వినూత్నంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ, 'ట్రైలర్ చూసిన తర్వాత హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. చాలా రిచ్‌గా, కాస్ట్లీగా తీశారు. హీరో రమణకు మంచి భవిష్యత్తు ఉంది. డైరెక్టర్ రవి చంద్రన్ ట్రైలర్లోనే తన ప్రతిభని చాటాడు. యూత్ అంతా ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు' అని చెప్పారు. 'ప్రొడ్యూసర్స్‌కి సినిమా అంటే చాలా ప్యాషనేట్. ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. హీరో రమణ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. తప్పకుండా మంచి హీరో అవుతాడు' అని దర్శకుడు రవిచంద్రన్ చెప్పారు. హీరో రమణ మాట్లాడుతూ, 'కళ్యాణ్‌గారు మాకు గురువు. ఆయన ఆశీర్వాదం, తోడు ఉంటే ఏదైనా సాధించగలం అనే నమ్మకం ఉంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది' అని తెలిపారు. 'ఈ సినిమా చాలా బాగా వచ్చింది. మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. మా బ్యానర్లో త్వరలోనే రెండు కొత్త సినిమాలను ఎనౌన్స్ చేస్తాం' అని నిర్మాత శిల్పిక. కె చెప్పారు. ఈ వేడుకలో నిర్మాతలు పుప్పాల రమేష్, లయన్ సాయివెంకట్ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.