Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన భారీ చిత్రం 'మరక్కార్'. అరేబియా సముద్ర సింహం అనేది ఉప శీర్షిక. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేద్దామనుకున్నారు. కానీ డిసెంబర్ 3న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాపై మలయాళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి బజ్ ఏర్పడింది. పైగా సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పాపులర్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అలాగే మోహన్‌లాల్‌కు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన హీరోగా వచ్చిన 'మన్యం పులి' సినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఆయన నటించిన 'జనతా గ్యారెజ్' బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఎన్నో మంచి చిత్రాలను నిర్మించి, రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆంటోని పెరంబువూర్ ఈ చిత్రాన్ని కాన్ఫిడెంట్ గ్రూప్ సంస్థతో కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అర్జున్, సునీల్ శెట్టి, కిచ్చా సుదీప్, ప్రభు, మంజు వారియర్, కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేశారు' అని తెలిపారు.