Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్‌పై ఈ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించారు. డిసెంబర్ 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా కథానాయిక ప్రగ్యా జైస్వాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, 'బాలకష్ణగారు చాలా సీనియర్. అంత పెద్ద హీరోతో ఇంత వరకు కలిసి నటించలేదు. ఆయనలాంటి పాజిటివ్ పర్సన్‌ని నేను ఇంత వరకు చూడలేదు. ఆయన వస్తుంటే.. సెట్ అంతా సైలెంట్ అవుతుంది. క్రమశిక్షణ, సమయపాలనలో ఆయన గ్రేట్. ఆయనతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇందులో శ్రావణ్య అనే ఐఏఎస్ ఆఫీసర్‌గా నటించాను. కథలో నాది చాలా కీలకమైన పాత్ర. నాకు ఎదురైన సంఘటనల వల్లే రెండో పాత్ర అయిన అఖండ ఎంట్రీ ఉంటుంది. అలా ఈ సినిమాలో నాకు నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ దక్కటం ఆనందంగా ఉంది. ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు చూసిన ప్రగ్యా కనిపించొద్దని బోయపాటి గారు అన్నారు. అందుకోసం ఈ పాత్రను చేయటానికి చాలా కష్టపడ్డాను. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. 'అఖండ' లాంటి కథ, బాలయ్య చేసిన క్యారెక్టర్ని నేను ఇంత వరకు చూడలేదు. అలాగే కమర్షియల్ చిత్రాల్లో ఉన్నట్టుగా ఇందులో పాటలు ఉండవు. అంతేకాదు ఈ సినిమాలో నటించిన ప్రతి పాత్రకు చాలా మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా శ్రీకాంత్, జగపతిబాబు పాత్రలకు ట్రెమండస్ రెస్పాన్స్ రావడం ఖాయం. దీనితోపాటు సినిమా కూడా చాలా అద్భుతంగా రావడం హ్యాపీగా ఉంది' అని తెలిపారు.