Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మా అద్భుతం చిత్రాన్ని ఆదరించి, మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు' అని అంటున్నారు యువ నిర్మాత సృజన్ ఎరబోలు. తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ జంటగా మల్లిక్‌రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అద్భుతం'.ఈ సినిమా ఇటీవల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డైరెక్ట్‌గా విడుదలైంది. విశేష ప్రేక్షకాదరణతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా ఈ చిత్ర సహ నిర్మాత సృజన్ ఎరబోలు శనివారం మీడియాతో సంభాషించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
మా 'అద్భుతం' సినిమా సక్సెస్‌కి కారణం ఒక్కటే.. కంటెంట్ వినూత్నంగా ఉండటం. అలాగే మెగాస్టార్ లాంటి టాప్‌స్టార్స్ సైతం ఈ సినిమా బాగుందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో ఓ పక్క సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే మరో పక్క ఓవర్సీస్లో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయటం స్టార్ట్ చేశాను. ఇప్పటివరకు 30 సినిమాలను పంపిణీ చేశాను. వాటిల్లో దాదాపు 18 సినిమాలు మంచి లాభాల్ని తీసుకొచ్చాయి. సినిమాలపై నాకు ఉన్న అనుభవంతో నిర్మాతగా మారాను. ఇందులో భాగంగా నిర్వాణ ఫిలింస్ ప్రొడక్షన్ కంపెనీని పార్టనర్స్‌తో స్టార్ట్ చేశాను. మేం చేసిన 'మను', 'సూర్యకాంతం' సినిమాలు రెండూ నిరాదరణ పొందాయి. ఇప్పుడు సొంతంగా ఎస్ ఒరిజినల్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ని రన్ చేస్తున్నాను. ప్రస్తుతం భాగస్వామ్యంతోనే కాకుండా సోలోగా దాదాపు 8 సినిమాలను నిర్మిస్తున్నాను. అలాగే కేవలం తెలుగుకే పరిమితం కాకుండా కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ప్రొడ్యూస్ చేస్తున్నాను. త్వరలోనే 'పంచతంత్రం' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నా సినిమాల్లో కథ, కంటెంటే హీరోలు. నూతన దర్శకులతోనే ఎక్కువగా సినిమాలు తీస్తాను. ఎందుకంటే రాజమౌళి లాంటి పెద్ద దర్శకుల చుట్టూ తిరగటం కన్నా, మనమే ఎందుకు రాజమౌళి లాంటి దర్శకులను తయారు చేయకూడదనే భావనతో ఉన్నా' అని తెలిపారు.