Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్య భరత్ చంద్ర, రేణు శ్రీ, నిరుషా హీరో, హీరోయిన్లుగా గోపి పోలవరపు స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'ఆధారం'. సీనియర్ నిర్మాత వల్లూరిపల్లి వెంకట్రావు వారసురాలు చిరంజీవి సితార వల్లూరిపల్లి ప్రజెంట్స్లో శ్రీ వేంకట లక్ష్మి క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'ట్రైలర్ చాలా బాగుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను' అని అన్నారు.
దర్శక, నిర్మాత గోపి పోలవరపు మాట్లాడుతూ, 'మా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన నిర్మాత బెక్కం వేణుగోపాల్గారికి, ఇప్పుడు మా చిత్ర ట్రైలర్ చాలా బాగుందని ప్రశంసిస్తూ, ట్రైలర్‌ను రిలీజ్ చేసిన నిర్మాత సిి.కళ్యాణ్‌గారికి మా ధన్యవాదాలు. ప్రతిభను ప్రోత్సహించాలనే తపనతో కొత్త నటీనటులతో ఈ సినిమా చేస్తున్నాం. ఆర్టిస్టులు అందరూ చాలా బాగా నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ నజీర్ అందించిన రెండు పాటలూ చాలా బాగా వచ్చాయి. క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని చెప్పారు. వాసు, యోగి కత్రి, వీరభద్రం, వెంకటేశ్వర రావు, వైజాగ్ సత్యనారాయణ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి డిఒపీ : వెంకట్, మ్యూజిక్ : యస్.యన్.నజీర్, ఎడిటర్ : మేనగ శ్రీను, లిరిక్స్ : అంబట్ల రవి, ఫైట్స్ : యాక్షన్ రవి, కొరియోగ్రాఫర్ : రజని.