Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూతన నాయకానాయికలు రవికుమార్, ఐశ్వర్య, హన్విక నటిస్తున్న చిత్రం 'ఏది నిజం'. శ్రీ పుష్పాంజలి క్రియేషన్స్ సమర్పణలో ఎస్.ఎస్.సి క్రియేషన్స్, రుద్రాని స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. సంపత్ శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నటులు బాబూమోహన్ చేతుల మీదుగా శ్రీ కష్ణనగర్ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఘనంగా జరిగాయి. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి షాట్‌కు బాబూ మోహన్ క్లాప్ కొట్టగా, జబర్ధస్త్ అప్పారావు కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఈ సందర్భంగా బాబూ మోహన్ మాట్లాడుతూ, 'కొత్త నటీనటులతో పాటు టెక్నీషియన్స్ అందరూ కొత్తవారే కావడం చాలా ఆనందంగా ఉంది. మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇందులో నటించిన అందరికీ మంచి పేరు రావాలని ఆశిస్తున్నాను' అని తెలిపారు. 'గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లోని యువత సమస్యలపై తీస్తున్న కథ ఇది. ఇందులో ఐదుగురు నటీనటులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు' అని దర్శకుడు సంపత్ శ్రీను అన్నారు. 'ఇదొక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. ముఖ్యంతా యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ఉండే సినిమా. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు' అని హీరో, హీరోయిన్లు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం : శ్రాన్, ఎడిటర్ : రుద్రాని, నిర్మాతలు: సురేష్ ఆత్రేయ, సంపత్ శ్రీను, లక్ష్మణ్ రావు, మహేష్ చౌదరి, చంద్రమోహన్, కథ- స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సంపత్ శ్రీను.