Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు, నటుడు కె.ఎస్.నాగేశ్వరరావు (56) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి పాలకొల్లు నుంచి హైదరాబాద్ వస్తుండగా మార్గం మధ్యలో ఫిట్స్ వచ్చి, అక్కడికక్కడే ఆయన మతి చెందారు.
'రిక్షా రుద్రయ్య' చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు ఆయన పరిచయమయ్యారు. శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ ఆయన తెరకెక్కించిన 'పోలీస్' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
'పోలీస్', 'దేవా', 'సాంబయ్య' వంటి చిత్రాలను శ్రీహరితో రూపొందించి, హ్యాట్రిక్ హిట్ సాధించారు. అలాగే లేడీ సూపర్‌స్టార్ విజయశాంతితో 'వైజయంతి' తీసి, సక్సెస్ అందుకున్నారు. ఆయన చివరి చిత్రం 'బిచ్చగాడా మజాకా'. ప్రస్తుతం ఇండిస్టీలో స్టంట్ మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పీటర్ హెయిన్స్ని సైతం ఆయనే పరిచయం చేశారు. శనివారం ఆయన స్వస్థలం పోతవరంలో అంత్యక్రియలు జరిగాయి. దర్శకుడిగానే కాకుండా పలు చిత్రాల్లో నటుడిగానూ మెరిసి ప్రేక్షకుల్ని అలరించిన నాగేశ్వరరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.