Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'స్కైలాబ్ గురించి ఎవరిని అడిగినా చాలా కథలు చెబుతున్నారు. ఈ జనరేషన్ వాళ్లకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. అందుకే ఆ జనరేషన్‌కి, ఈ జనరేషన్‌కీ కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. 'స్కైలాబ్' లాంటి సినిమాని నిర్మించినందుకు హ్యాపీగా ఉన్నా' అని హీరోయిన్, నిర్మాత నిత్యామీనన్ అన్నారు.
1979లో సాగే పీరియాడిక్ మూవీ 'స్కై లాబ్'. సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకష్ణ ప్రధాన తారాగణంగా నటించారు. డా.రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పథ్వీ పిన్నమరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 4న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిత్యామీనన్ శనివారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం..
ఈ సినిమాతో నేను నిర్మాతగా మారటానికి కారణం.. స్క్రిప్ట్. ఇలాంటి స్క్రిప్ట్ వింటే ఎవరైనా ఎగ్జైట్ అవుతారు. అంత పొటెన్షియల్ ఉన్న స్క్రిప్ట్. ట్రీట్మెంట్ కూడా చాలా బాగా అనిపించింది. తెలుగు సినిమాకి ఇది చాలా కొత్తగా ఉంటుంది.
తెలంగాణలోని బండలింగం పల్లి వంటి చిన్న గ్రామంలో జరిగే కథ. ఈ గ్రామంలో గౌరి(నిత్యా మీనన్) ఓ ధనివంతురాలి బిడ్డ. కానీ జర్నలిస్ట్ కావాలనే కోరికతో ప్రతిబింబం పత్రికకు వార్తలు సేకరించి రాస్తుంటుంది. అదే గ్రామం నుంచి డాక్టర్ చదువుకు చదివిన ఆనంద్(సత్యదేవ్) హాస్పిటల్ పెట్టాలనే ఆలోచనతో ఉంటాడు. వీరికి సుబేదార్ రామారావు(రాహుల్ రామకష్ణ)తో స్నేహం కుదురుతుంది. ఈ ముగ్గురు వారి, వారి సమస్యలను పరిష్కరించాలనుకుంటున్న క్రమంలో అంతరిక్ష్యంలో ప్రవేశ పెట్టిన స్కైలాబ్ సాంకేతిక లోపాల వల్ల అది నేరుగా బండ లింగపల్లిలోనే పడుతుందని రేడియోలో వార్త వస్తుంది. ఈ వార్తతో అందరి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయనేదే 'స్కై లాబ్' సినిమా. బ్యాక్‌గ్రౌండ్‌లో వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ ఉంటుంది. సినిమాలో అలాంటి పారడాక్సికల్ ట్రీట్మెంట్ ఉంటే నాకు చాలా ఇష్టం. అది వినగానే వెంటనే ఒప్పేసుకున్నా. అంతేకాదు కథ విన్నప్పుడు కచ్చితంగా ఇలాంటి సినిమా స్క్రీన్ మీదకు రావాలని అనుకున్నా. అందుకే నేనూ నిర్మాతగా మారాను. ఓ పక్క నటిస్తూ, మరో పక్క ప్రొడక్షన్ చూసుకోవడం ఇబ్బందిగా అనిపించింది. ఇందులో జర్నలిస్ట్‌గా నటించా. నా పాత్ర కోసం తెలంగాణ యాసలో మాట్లాడా. అదీ సింక్ సౌండ్‌లో చేశాం. పర్ఫెక్ట్గా రావడంతో డబ్బింగ్ కూడా అవసరం లేదన్నారు. నాకు తెలంగాణ యాక్సెంట్ అంటే చాలా ఇష్టం. వినటానికి చాలా అందంగా ఉంటుంది. దీంతో నా పాత్రని పోషించటానికి ఛాలెంజింగ్‌గా అనిపించలేదు. ఎంతో సరదాగా చేశా. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌తో 'భీమ్లానాయక్' చేస్తున్నా. నేను 'స్కైలాబ్'తో నిర్మాతగా మారానని ఆయనకు చెబితే, చాలా ఆశ్చర్యపోయారు' అని చెప్పారు.