Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'రాధే శ్యామ్'. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదలైంది. గుండె ఒక్కటే అయినా.. రెండు చప్పుళ్ళు ఉంటాయంటూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఈ పోస్టర్లో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరూ పరదా చాటున ఎంతో అద్భుతంగా ఉన్నారు. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ రొమాంటిక్ జోనర్లో చేస్తున్న సినిమా ఇది. ఇది గొప్ప ప్రేమకథ అని మెషన్ పోస్టర్‌తోనే రివీల్ అయ్యింది. అలాగే రీసెంట్గా విడుదలైన విక్రమాదిత్య క్యారెక్టర్ టీజర్, 'ఈ రాతలే..' పాటకు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. యూ ట్యూబ్‌లోనూ రికార్డులు తిరగరాసింది. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇటలీలో జరిగే ప్రేమకథగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ప్రజెంట్ చేశారు. దీనికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. హిందీ వర్షన్‌కు మాత్రం మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఈనెల 29న ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ 'నగుమోము తారలే..' టీజర్‌ను విడుదల చేయడానికి రంగం సిధ్ధం అయింది. అందుకే 'ఒకే గుండెకు రెండు చప్పుళ్లు..' అనే పోస్టర్ని మేకర్స్ రిలీజ్ చేశారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ అద్భుతంగా చేేశారు. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. జనవరి 14, 2022న ఈ సినిమా విడుదల కానుంది' అని తెలిపింది.