Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సమ్మతమే'. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా అర్బన్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లేటెస్ట్గా కష్ణ, సత్యభామ అంటూ సాగే మొదటి పాటను విడుదల చేశారు.
'కష్ణ, సత్యభామల మధ్య ఉండే ప్రేమను చూపించేలా, కిరణ్ అబ్బవరం, చాందినీల మధ్య రొమాంటిక్ ట్రాక్‌ను ఈ పాటలో అద్భుతంగా చూపించారు. శేఖర్ చంద్ర అందించిన మెలోడి ట్యూన్ అలరిస్తోంది. కష్ణ కాంత్ సాహిత్యం యూత్‌ను మెప్పించేలా ఉంది. యాజిన్ నాజిర్, శిరీష భగవతుల గాత్రం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి సరికొత్త ప్రేమకథతో రాబోతోన్నట్టు కనిపిస్తోంది. ఫస్ట్ గ్లింప్స్, పాటతో సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. హీరో, హీరోయిన్ల కారెక్టర్లలో ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. హీరో కిరణ్ సైలెంట్, కూల్ అండ్ సాఫ్ట్‌గా కనిపిస్తే, హీరోయిన్ చాందినీ చౌదరి మాత్రం మందు, దమ్ము కొడుతూ చిల్ అవుతోంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర బృందం పేర్కొంది.