Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్‌పై ఈ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించారు. బాలకష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఇందులో ఓ ముఖ్య పాత్ర చేసిన కథానాయిక పూర్ణ సోమవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
2008లో 'సీమ టపాకారు' విడుదలైంది. 'అవును' సినిమా తర్వాత చాలా మంచి ఆఫర్లు వచ్చాయి. ఇన్నేళ్ల తరువాత ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్‌లో ఆఫర్ రావడం ఆనందంగా ఉంది.
ఇందులో నేను పద్మావతి అనే పాత్రలో కనిపిస్తాను. చాలా ఇంపార్టెంట్ రోల్. బోయపాటి గారి సినిమాల్లో మహిళా పాత్రలు చాలా శక్తివంతంగా ఉంటాయి. హీరోయిన్ కారెక్టర్తోపాటు మిగతా పాత్రలు కూడా ఎంతో స్ట్రాంగ్ ఉంటాయి.
పాత్రలో డామినేషన్ ఉంటుందని బోయపాటి గారు ముందే చెప్పారు. బాలా సర్ ముందు నిలబడి అలాంటి డైలాగ్స్ చెప్పాలా? అని భయపడ్డాను. కానీ బాలా సర్ ఎంతో సహకరించారు. ఆయన ఎనర్జీ మామూలుగా ఉండదు. ఒక్కో ఫైట్ దాదాపు 17 రోజులు ఉండేది. సెట్లో అందరూ అలసిపోయి కనిపిస్తారు. కానీ బాలా సర్ మాత్రం.. సింహం సింహమే. ఎంతో ఎనర్జీగా ఉంటారు. ఆ ఎనర్జీ నాక్కూడా రావాలని నా ఫోన్లో ఆయన వాల్ పేపర్ పెట్టుకుంటాను (నవ్వుతూ). బాలా సర్ పోషించిన రెండు పాత్రలతో సీన్లు ఉంటాయి. అఘోర పాత్రలో బాలా సర్‌ను చూస్తే నాకు దేవుడిని చూసినట్టు అనిపించేది.
ఇందులో నాకు మూడు సీన్లు ఉంటాయి. వాటి గురించి అలాగే పూర్ణ మంచి పాత్ర చేసిందని ఆడియెన్స్ అంటారు. నా పాత్ర చాలా ముఖ్యమైంది. మెచ్యూర్డ్, డామినేషన్, హెల్త్ మినిష్టర్ లాంటి కారెక్టర్. హీరోయిన్ ఐఏఎస్ పాత్రలో కనిపిస్తారు. ఆమెను ట్రైన్ చేస్తాను. ఈ సినిమా తర్వాత నాకు మరిన్ని మంచి పాత్రలు వస్తాయని ఆశిస్తున్నాను.
నా లక్కీ నంబర్ 5. 2021లో మొత్తం కూడితే 5 వస్తుంది. నాకు ఈ ఏడాదిలో మంచి పాత్రలు వచ్చాయి. హీరోయిన్గా చేయాలని కాదు. నాకు నాలుగైదు సీన్లు ఉన్నా కూడా ఇంపాక్ట్ చూపించాలి. 'దశ్యం 2'లో అందరూ బాగా నటించావని అన్నారు. అలా నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలని, సుహాసిని, రేవతి వంటి వారిని చూసి ఎలాంటి పాత్రలైనా చేయాలని డిసైడ్ అయ్యాను. నాకు డ్యాన్స్ బాగా వచ్చు. కానీ డ్యాన్స్ చేసే పాత్ర మాత్రం ఇంత వరకు రాలేదు. టీవీలో కనిపిస్తే మళ్లీ సినిమా అవకాశాలు వస్తాయో? రాదో అనే అనుమానం ఉండేది. కానీ నేను చాలా లక్కీ. సినిమా అవకాశాలు వస్తున్నాయి. నాకు ఢ షో ఎప్పుడూ ప్లస్ అవుతూనే వచ్చింది.