Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకష్ణ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం 'స్కై లాబ్'. డా.రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పథ్వీ పిన్నమరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర బృందం వైభవంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కథానాయకుడు నాని మాట్లాడుతూ, 'యూనిట్‌లోని ప్రతి ఒక్కరి ముఖం చాలా బ్రైట్‌గా వెలిగిపోతోంది. సినిమా రిలీజ్ అనే టెన్షన్ ఎవ్వరిలోనూ కనిపించలేదు. పైగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే హిట్ కొట్టేస్తున్నాం. చూడండి అన్న చందంగా ఉంది. అంత పాజిటీవ్ వైబ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఇవన్నీ కూడా
ఓ హిట్ సినిమాని చూడబోతున్నాం అనేలా ఉన్నాయి.
ఈ సినిమాని నాతో చేయాలని దర్శకుడు అనుకున్నారట. స్కైలాబ్ కాన్సెప్ట్ కూడా చెప్పాడు. అది విన్న తర్వాత ఛాన్స్ మిస్సయ్యాయనే ఫీలింగ్ కలిగింది. అయితే ఈ సినిమాని నిత్యామీనన్ చేయటం మరింత ఆనందంగా ఉంది. నేనే చేశాను అనే భావనతో ఉన్నా. ఎందుకంటే తను వర్సటైల్ యాక్ట్రెస్. ఏ భాషలో నటించిన సరే నిత్యా బాగా చేసిందని అని అందరూ అప్రిషియేట్ చేస్తారు. అంతేకాదు తాను ఎంచుకునే పాత్రలు, సినిమాలు రెగ్యులర్‌గా ఉండవు. అలాంటి నిత్యామీనన్ నిర్మాతగా మారి ఈ సినిమా చేసిందంటే.. నో డౌట్ ఇది చాలా చాలా మంచి కాన్సెప్ట్‌తో రాబోతోందని వేరే చెప్పక్కర్లేదు. సత్యదేవ్ కూడా మంచి పాత్రల్ని ఎంచుకోవడం ఎప్పుడూ ముందుంటాడు. దర్శకుడి విజన్‌ని స్క్రీన్ మీదకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ ఎంతగా సహకరించారో వీళ్ళందరి మాటల్లో అర్థమవుతోంది. వీళ్ళందరి కాన్ఫిడెన్స్ చూస్తుంటే బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ ఖాయం' అని చెప్పారు.
దర్శకుడు విశ్వక్ ఖండేరావు మాట్లాడుతూ, '12 సంవత్సరాల నా కల ఇది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరూ సహకరించారు. ఇలాంటి కాన్సెప్ట్‌లతో సినిమాలు చేసేవాళ్ళు చాలా అరుదు. అలాంటి అరుదైన నిర్మాతలు నాకు దొరకటం అదృష్టం' అని తెలిపారు. 'ఈ సినిమా హిట్ అవుతుందనే పాజిటివ్ సైన్స్ నాకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నానిగారు మా ఈవెంట్‌కి వచ్చి ఎంకరేజ్ చేయటం బిగ్టెస్ట్ పాజిటివ్ సైన్. ఓ మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఇలాంటి సినిమాలో నటించటం చాలా చాలా ఆనందంగా ఉంది' అని హీరో సత్యదేవ్ అన్నారు. 'ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చేలా మా చిత్రాన్ని నిర్మించాం. అందరి సహకారంతో సినిమా చాలా బాగా వచ్చింది' అని నిర్మాత పృథ్వీ పిన్నమనేని తెలిపారు. ఈ వేడుకలో చిత్ర సమర్పకుడు డా.రవి కిరణ్, వివేక్ ఆత్రేయ, మున్నా, వెంకట్ మహ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
ఈ సినిమా నాకు చాలా చాలా స్పెషల్. నటిగానే కాకుండా నిర్మాతగానూ ఎంతో గర్వంగా, సంతోషంగా ఫీలవుతున్నా. ఇలాంటి కథలు చాలా రేర్‌గా వస్తుంటాయి. స్కైలాబ్ అనగానే అందరిలోనూ డెఫినెట్‌గా ఓ టెన్షన్ రన్ అవుతుంది. అంతలా మనందరిలో భయాన్ని క్రియేట్ చేసింది. దాన్ని బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని దర్శకుడు విశ్వ అత్యద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించాడు. అలాగే నాతోపాటు ఎంతో ప్యాషనేట్‌గా నిర్మాత పృధ్వీ ఈ సినిమా కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. మా ప్రయత్నాన్ని అందరూ విజయవంతం చేస్తారని ఆశిస్తున్నా.
- నిత్యామీనన్