Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్తో 'పుష్ప' టీమ్ అందర్నీ సర్ప్రైజ్ చేస్తోంది. అల్లుఅర్జున్, రష్మిక మందన్నా, ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరుల ఫస్ట్‌లుక్‌లు, 'దాక్కో దాక్కో మేక', 'పలుకే బంగారమాయే శ్రీ వల్లి'.., 'సామి సామి..', 'ఏ బిడ్డా.. ఇది నా అడ్డా..' పాటలు విశేష ప్రాచుర్యం పొంది సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసు కెళ్ళాయి. ఆ అంచనాలను రెట్టింపు చేసేలా డిసెంబర్ 6న రిలీజ్ చేయబోయే ట్రైలర్ ఉంటుందని చిత్ర బృందం ఎంతో నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ట్రైలర్ రిలీజ్‌కి సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్, అందులో అల్లు అర్జున్ లుక్ అందర్నీ మెస్మరైజ్ చేస్తూ, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెెరకెక్కుతున్న సినిమా 'పుష్ప'. 'ఆర్య', 'ఆర్య 2' సినిమాల తర్వాత వీరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో మొదటి భాగం 'పుష్ప: ది రైజ్' క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.
ధనుంజరు, రావు రమేష్, అజరు ఘోష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, సినిమాటోగ్రాఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: రామకష్ణ - మోనిక నిగొత్రే, సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్, లిరిసిస్ట్: చంద్రబోస్.