Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ నటుడు శరత్‌బాబు తమ్ముడి తనయుడు ఆయుష్ హీరోగా పరిచయం అవుతూ రూపొందుతున్న చిత్రం 'దక్ష'. ఈ చిత్రం ద్వారా వివేకానంద విక్రాంత్ దర్శకుడిగా పరిచయం చేస్తూ, శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై తల్లాడ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ లోగోను తనికెళ్ళ భరణి, శరత్ బాబు విడుదల చేశారు.
ఈ సందర్భంగా తనికెళ్ళ భరణి మాట్లాడుతూ, ''దక్ష' అంటే అన్ని వ్యవహారాలు సమన్వయం చేసేవాడు అని అర్థం. అతనే మా తల్లాడ సాయి కష్ణ. గతంలో తాను డైరెక్ట్ చేసిన ఒక వ్యవసాయ షార్ట్ ఫిలింకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. శరత్ బాబు గారి తనయుడు ఆయుష్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆయుష్‌కి ఈ చిత్రం మంచి విజయం అందించాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.
'ఆయుష్ నా తమ్ముడి కొడుకు, నా కొడుకు కూడా. ఈ సినిమా మంచి విజయం సాధించి, దర్శక, నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలి' అని శరత్‌బాబు చెప్పారు. నటుడు తల్లాడ వెంకన్న మాట్లాడుతూ, 'తల్లాడ సాయి కష్ణ మా తమ్ముడి కొడుకు. తనకు మంచి బంగారు భవిష్యత్తు ఉండాలి' అని తెలిపారు. 'దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. నిర్మాత తల్లాడ సాయి కష్ణ చాలా సపోర్ట్ చేసారు. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి సక్సెస్ సాధిస్తుంది' అని దర్శకుడు వివేకానంద విక్రాంత్ చెప్పారు. హీరో ఆయుష్ మాట్లాడుతూ, 'నేను హీరో అవ్వాలి అన్నది నా డ్రీమ్. ముంబైలో యాక్టింగ్ కోర్స్ చేశాను. ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాను. హైదరాబాద్, అరకు, ఖమ్మం లాంటి ఎన్నో లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం. ఇదొక థ్రిల్లర్ సినిమా. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదల అవుతుంది' అని తెలిపారు. 'సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉంది. త్వరలోనే విడుదల చేస్తాం. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం' అని నిర్మాత తల్లాడ సాయి కష్ణ అన్నారు. కథానాయికలు అను, నక్షత్ర ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.