Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా నటించిన చిత్రం 'లక్ష్య'. ఈ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కె.నారంగ్, పుస్కర్ రామ్మోహన్ రావు, శరత్‌మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 10న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు వెంకటేష్ విడుదల చేసి, టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ఈ సందర్భంగా మీడియాతో డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ,'ఆర్చరీ మీద వస్తున్న మొదటి సినిమా. నేను రాసుకున్నది నలభై శాతం అయితే, వంద శాతాన్ని చేసింది నాగ శౌర్య' అని చెప్పారు.
'చాలా కాలం తర్వాత క్రీడా నేపథ్యంలో ఈ సినిమా వస్తుండటంతో అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ సినిమా కోసం నాగ శౌర్య చాలా కష్టపడ్డారు. కాలభైరవ మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా అద్భుతంగా వచ్చింది' అని నిర్మాత పి.రామ్మోహన రావు తెలిపారు.
నాగ శౌర్య మాట్లాడుతూ, 'దర్శకుడు కథని అద్భుతంగా తెరకెక్కించాడు. కాల భైరవ ఆర్ఆర్ అదరగొట్టేశాడు. నేను మోయలేని సమయంలో జగపతిబాబు, సచిన్ ఖేద్కర్ వచ్చి నిలబెడతారు. మా ముగ్గురి వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది' అని చెప్పారు.