Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ వ్యాప్తంగా ఎలాంటి విపత్తు సంభవించినా.. బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర సీమ ఎప్పుడూ ముందుంటూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వరద బాధితులను ఆదుకునేందుకు తాజాగా మరోసారి యావత్ తెలుగు పరిశ్రమ రంగంలోకి దిగింది. ఏపీలో కొన్ని ప్రాంతాలను ఇటీవల వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ వరదలతో నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ వరదల విలయతాండవానికి తీవ్రంగా నష్టపోయిన వాళ్లకు సాయంగా అగ్ర కథానాయకులు చిరంజీవి, రామ్‌చరణ్, ఎన్టీఆర్, మహేష్‌బాబు ఒక్కొక్కరు రూ.25 లక్షలను, నిర్మాత అల్లు అరవింద్ 10 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించి, తమ పెద్ద మనసుని చాటుకున్నారు. అంతేకాకుండా భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులైన వారిని ఆదుకోవాలని సామాజిక మాధ్యమాల వేదికగా తమ అభిమానులకు పిలుపునిచ్చారు. వీరి బాటలోనే మరికొంత మంది సినీ ప్రముఖులు సాయం అందించేందుకు సిద్ధమవుతున్నారు.