Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకష్ణ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం 'స్కైలాబ్'. డా.రవికిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై పథ్వీ పిన్నమరాజు నిర్మించారు. విశ్వక్ ఖండేరావు దర్శకుడు. నిత్యామీనన్ సహ నిర్మాత. ఈ సినిమా ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్ మీడియాతో మాట్లాడుతూ,'స్కై లాబ్ పడి పోతుందని, ఓ పర్టికులర్ గ్రామం నాశనమై పోతుందనే వార్త బయటకు రావడంతో, అప్పట్లో అందరూ భయపడ్డారు. దీన్ని బేస్ చేసుకుని తెరకెక్కిన చిత్రమిది. ఇందులో
నా క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుంది. స్కై లాబ్ పడిపోతున్నప్పుడు దాన్ని ఉపయోగించుకుని డబ్బులు సంపాదించాలనుకునే ఆనంద్ అనే డాక్టర్ చివరకు ఎలా మారిపోతాడనేది నా క్యారెక్టర్లో చూడొచ్చు. నటుడిగా ఏ పాత్రనైనా ఛాలెంజింగ్‌గా తీసుకుంటా.అందుకే 'స్కై లాబ్' సినిమా చేశా. 'గుర్తుందా శీతాకాలం'లో మూడు వేరియేష్స్ ఉన్న పాత్ర చేశా. ఫస్ట్టైమ్లో చేస్తున్న లవ్‌స్టోరీ ఇది. చిరంజీవిగారి 'గాడ్‌ఫాదర్'లో నటిస్తున్నాను' అని తెలిపారు.