Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సినిమా పాటకి విశ్వవ్యాప్తంగా వన్నె తెచ్చిన దిగ్గజ గీత రచయిత 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి అంత్యక్రియలు ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానుల అశ్రునయాలతో ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు. బుధవారం ఉదయం సిరివెన్నెల భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి ఫిలింఛాంబర్‌కు తీసుకొచ్చారు. అక్కడ సిరివెన్నెల పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు ఘన నివాళులర్పించి, ఆయనతో తమకి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకి తీరని లోటని, భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన పాటలు ప్రేక్షకుల మనసుల్లో సజీవంగా ఉంటాయని చెబుతూ పలువురు ప్రముఖులు కన్నీటి పర్యంతమయ్యారు.
'సిరివెన్నెల' చికిత్స నిమిత్తం కిమ్స్ హాస్పిటల్లో కట్టిన అడ్వాన్స్‌తోపాటు అయిన ఖర్చు మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లిస్తుందని, అలాగే తెలంగాణ ప్రభుత్వం తమ కుటుంబానికి అండగా నిలుస్తుందని తెలియజేసిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వై.ఎస్.జగన్, కేసీఆర్‌కు 'సిరివెన్నెల' కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.