Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీకాంత్ బైరోజు, గీతికా రతన్ జంటగా నటిస్తున్న చిత్రం 'నువ్వుంటే.. నా జతగా'. సాయి అక్షయ ప్రొడక్షన్స్ పతాకంపై మ్యాన్ కైండ్ మూవీస్ సమర్పణలో సుమలత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంజయ్ కర్లపూడి దర్శకుడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత సుమలత మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో జంటగా నటించిన శ్రీకాంత్ బైరోజు, గీతికా రతన్ అద్భుత మైన సహజ నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తారు. రెగ్యులర్‌గా వస్తున్న ప్రేమకథా చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా చాలా భిన్నంగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే 100% రొటీన్ లవ్‌స్టోరీ కాదు. దర్శకుడు సంజయ్ కర్లపూడి ఈ చిత్రాన్ని చాలా చక్కగా చిత్రాన్ని తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నఈ సినిమా కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది. ఈనెలలోనే మా చిత్రాన్ని భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశాం' అని నిర్మాత సుమలత తెలిపారు. 'ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే రీతిలో మా చిత్రాన్ని తెరకెక్కించాం. జ్ఞాని అందించిన సంగీతం, అల్లు సుకుమార్ కెమెరా పనితనం అన్నింటికి మించి మా నిర్మాత సుమలత అందించిన సహకారం, మేకింగ్‌లో రాజీపడని తనం.. ఇవన్నీ మంచి అవుట్‌ఫుట్ రావడానికి దోహదపడ్డాయి. కార్తిక్ గుర్రం ఎడిటింగ్ సినిమాకి బాగా ప్లస్ అవుతుంది. నాయకానాయికలు శ్రీకాంత్ బైరోజు, గీతికా రతన్‌కి ఈ సినిమా తర్వాత మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి' అని దర్శకుడు సంజరు కర్లపూడి తెలిపారు.