Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గద్దె శివకష్ణ, వెలగ రాము సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'పంచనామ'. హార్దిక్ క్రియేషన్స్ బ్యానర్ పై సిగటాపు రమేష్ నాయుడు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్ర టైటిల్‌ని తాజాగా నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దర్శకుడు సిగటాపు రమేష్ నాయుడు మాట్లాడుతూ, 'ఈ కథని, నన్ను నమ్మడమే కాకుండా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా వెన్ను తట్టి నడిపించిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ఒక వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం' అని తెలిపారు.
'కథలోని ఇంటెన్సిటీ తగ్గకుండా జనాదరణ పొందే విధంగా అత్యుత్తమ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇది కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందే చిత్రమవుతుందనే విషయం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్‌తో అర్థమైంది. త్వరలోనే సినిమాని మీ ముందుకు తీసుకొస్తాం' అని నిర్మాతలు చెప్పారు.