Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ నటి జయలలిత మొట్టమొదటి సారి ఎ.ఆర్.కె. విజువల్స్ బ్యానర్ పై సమర్పిస్తున్న చిత్రం 'రుద్రం కోట'. గురువారం ఈ చిత్ర టైటిల్ లాంచ్ వేడుకకు కథానాయకుడు మోహన్ బాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి, టైటిల్‌ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నాకు 'రౌడీ గారి పెళ్ళాం' చిత్రం నుంచి జయలలిత తెలుసు. తనంటే నాకు చాలా గౌరవం, ప్రేమ, అభిమానం. అందుకే తాను సమర్పకురాలిగా ఉన్న ఈ చిత్రానికి సపోర్ట్ చేయాలని వచ్చాను. ఈ చిత్ర నిర్మాత అనిల్, దర్శకుడు కోన రాముకి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను' అని తెలిపారు.
''రుద్రం కోట' చాలా మంచి కథ. అందుకే మొదటి సారి అటెంప్ట్ చేస్తున్నాను.. హీరో అనిల్ రుద్రంగా, నేను కోటమ్మగా నటిస్తున్నాం. ఒకప్పుడు ఈ ఊరు ఖమ్మం జిల్లాలోని పోలవరం చుట్టుపక్కల ఉండేది. ఇప్పుడది పోలవరం ప్రాజెక్ట్‌లో పోయింది. అక్కడే షూటింగ్ చేశాం. ఇందులో నటించిన ప్రతి పాత్రకీ ప్రాధాన్యత ఉంది. సినిమాలోని 5 పాటలూ అందర్నీ అలరిస్తాయి. ఈ చిత్రానికి 'రుద్రం కోట' అని ఎందుకు పెట్టామనేది మాటల్లో కంటే వెండితెరపై చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది' అని జయలలిత అన్నారు. హీరో, నిర్మాత అనిల్ కొండవల్లి, దర్శకుడు కోన రాము, హీరోయిన్ విభీష, రైటర్ వెంకట్ బాబు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్: సుభాష్, ఫైట్స్: జాషువా, కొరియోగ్రాఫర్: శివశంకర్ మాస్టర్, సుచిత్ర చంద్రబోస్, లిరిక్స్: సాగర్, ఎడిటింగ్: ఆవుల వెంకటేష్, కథ-దర్శకత్వం: కోన రాము.