Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ శౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిన చిత్రం 'లక్ష్య'. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 10న విడుదల కానుంది. ఈ సందర్బంగా కథానాయిక కేతిక శర్మ శుక్రవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం...
నేను నటించిన 'రొమాంటిక్', 'లక్ష్య' సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కావడం ఆనందంగా ఉంది. 'రొమాంటిక్' చిత్రంలో చేసిన పాత్రకు, ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్‌కి అస్సలు సంబంధం ఉండదు. నా నటనలోని వైవిధ్యాన్ని చూపించాలనే తపనతో ఈ సినిమాకి గ్రీన్‌సిగల్ ఇచ్చాను.
ఈ సినిమాలో రితిక అనే పాత్రలో నటించా. తన మనసుకు ఏమనిపిస్తే అదే చేస్తుంది. నిజ జీవితంలోనూ నేనూ ఇలాగే ఉంటా (నవ్వుతూ). పక్కింటి అమ్మాయిలా కనిపిస్తాను. ఈ సినిమా పార్ధు (నాగశౌర్య) చుట్టూ తిరుగుతుంది. అతన్ని ప్రేమించే అమ్మాయిగా ప్రేక్షకుల్ని అలరిస్తా.
ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. నాగ శౌర్య అద్భుతంగా నటించారు. ఆయన పాత్రలో ఎన్నో వేరియేషన్స్ కనిపిస్తాయి. అలాగే నా క్యారెక్టర్ కూడా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.
నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. నేను స్టేట్ లెవెల్ స్విమ్మర్‌ని. మా అమ్మ కూడా నేషనల్ లెవెల్ స్విమ్మర్. స్విమ్మింగ్ బేస్డ్ సినిమా వస్తే కచ్చితంగా చేస్తాను. ఆర్చరీ మీద సినిమాలు ఇంత వరకు సినిమాలు రాలేదు. అదే నాకు ఆసక్తిగా అనిపించింది.
దర్శకుడు సంతోష్‌కి చాలా క్లారిటీ ఉంది. ఆయనకేం కావాలో క్లియర్‌గా తెలుసు. సినిమా మీద చాలా నమ్మకంగా ఉంటారు. డైరెక్టర్ అలా ఉంటే అందరిలోనూ ఎనర్జీ వస్తుంది. ప్రస్తుతం నా మూడో ప్రాజెక్ట్ వైష్ణవ్ తేజ్‌తో చేస్తున్నాను. నటి కావాలనే నా కల నెరవేరడంతోపాటు వరుస అవకాశాలతో బిజీగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. మంచి పాత్రలొస్తే ఏ భాషలోనైనా నటించడానికి నేనెప్పుడై సిద్ధమే.