Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ నటీనటులుగా తెరకెక్కిన చిత్రం 'రామ్ అసుర్'. ఎఎస్పి మీడియా హౌస్, జివి ఐడియాస్ పతాకాలపై వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది.
గత నెల 19న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, విశేష ప్రేక్షకాదరణతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత, హీరో అభినవ్ సర్ధార్ తన విజయానందాన్ని శనివారం మీడియాతో షేర్ చేసుకున్నారు. 'మేం ఊహించినదాని కంటే సినిమా మంచి విజయం సాధించింది. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. నటీనటులతో పాటు జె.ప్రభాకరరెడ్డి సినిమాటోగ్రఫీ, భీమ్స్ సిసిరోలియో సంగీతం, యాక్షన్ పార్ట్ ఇలా... అన్ని క్రాఫ్ట్స్ ఇచ్చిన బెస్ట్ అవుట్‌ఫుట్ సినిమా సక్సెస్‌కి బాగా దోహదపడ్డాయి. అన్నింటికిమించి మంచి కంటెంట్ ఉన్న కథ ఇది. కత్రిమంగా వజ్రం తయారీ అనేది వినటానికే చాలా కొత్తగా అనిపించే అంశం. ఈ అంశాన్ని కథగా తీసుకోవడమే మా సక్సెస్‌కు తొలి అడుగు పడింది. ఓ పక్క పలు బిజినెస్‌లు చేస్తూ, మరో పక్క సినిమాల్లో నటిస్తూ, నిర్మించడం ఎలా సాధ్యమైందని అందరూ అడుగుతున్నారు. ప్యాషన్, ప్లానింగ్ ఉంటే ఏమైనా, ఎన్నైనా చేయొచ్చు. గతంలో కింగ్‌ఫిషర్‌కి సౌత్ ఇండియా మార్కెటింగ్ హెడ్‌గా చేశాను. అలాగే కోకా కోలా కంపెనీ కోస్టల్ ఏరియాకీ హెడ్‌గా ఉన్నాను. ప్రస్తుతం స్వంతంగా కెఫేస్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీ, అలాగే హైదరాబాద్ తల్వార్స్ సెలబ్రిటీ క్రికెట్ టీం నాదే. ఇతర బిజినెస్‌లూ ఉన్నాయి. అయినప్పటికీ సినిమా, నటన అంటే నాకెంతో ప్యాషన్. ప్రస్తుతం 'మిస్టేక్' అనే సినిమా చేస్తున్నాను. ఇది నా సొంత ప్రాజెక్ట్. ఇందులో నాది నెగెటివ్ క్యారెక్టర్. హాలీవుడ్ స్థాయిలో గెటప్ ఉంటుంది. అక్వామేన్ టైప్‌లో ఉండే చాలా డిఫరెంట్ గెటప్. అలాగే తమిళం నుంచి రెండు, మూడు అవకాశాలు వచ్చాయి. మంచి నటుడుగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి హీరోగానే కాకుండా నెగెటివ్ క్యారెక్టర్స్‌ని చేసేందుకు సిద్ధంగా ఉన్నా' అని అభినవ్ సర్ధార్ చెప్పారు.