Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేవలం 10 గంటల వ్యవధిలో చిత్రీకరణ పూర్తి చేయడంతో 'వైట్ పేపర్' చిత్రాన్ని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అరుదైన చిత్రంగా గుర్తించింది. జి.ఎస్.కె ప్రొడక్షన్స్ పతాకంపై అదిరే అభి (అభినయ కష్ణ) వాణి, తల్లాడ సాయి కష్ణ, నేహా, నందకిషోర్ ముఖ్య పాత్రధారులుగా నటించిన చిత్రం 'వైట్ పేపర్'. శివ దర్శకత్వంలో గ్రంధి శివ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్ర టీజర్ లాంచ్ సినీ అతిరథుల సమక్షంలో ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నటి, ఎమ్యెల్యే రోజా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,'పది గంటల్లో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. మేం తమిళంలో 'స్వయంవరం' చిత్రాన్ని 24 గంటల్లో పూర్తి చేశాం. ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు' అని చెప్పారు. హీరో అదిరే అభి మాట్లాడుతూ,'ఒకే లోకేషన్లో జరిగే 'ఫోన్ బూత్', '7500' వంటి సినిమాలు హాలీవుడ్లో వచ్చాయి. తెలుగులోనే కాదు ఇండియాలో కూడా ఇప్పటివరకు 10 గంటల్లో పూర్తి చేసిన సినిమాలు రాలేదు' అని తెలిపారు. 'సస్పెన్స్ కథనంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేస్తాం' అని దర్శకుడు శివ అన్నారు.