Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్సకి అయ్యే మొత్తం భారీగా ఉండటంతో ఆయన కుటుంబ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కందికొండ తనయ మాతృక తమని ఆర్థికంగా ఆదుకోవాలని మంత్రి కేటీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా విజ్జప్తి చేశారు. దీనికి కేటీఆర్ స్పందించి, గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా కందికొండ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. కొన్ని నెలల కిందట కందికొండ తీవ్ర అనారోగ్యానికి గురై పలుమార్లు ఆస్పత్రిలో చేరగా, మంత్రి కేటీఆర్ ఆయనకు మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కందికొండ ఆరోగ్యం నిలకడగా ఉన్నా.. ఆయన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఇంటి అద్దె చెల్లించలేకపోవడంతో ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మాతక ఆవేదన వ్యక్తం చేసింది. తమకు చిత్రపురి కాలనీ లేదా ఇంకెక్కడైనా నివాసం కల్పించాలని కోరుతూ మంత్రి కేటీఆర్‌కి రాసిన లేఖలో అభ్యర్థించింది. 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం', 'ఇడియట్', 'సత్యం', 'పోకిరి' వంటి తదితర చిత్రాలకు కందికొండ రాసిన పాటలు మంచి ఆదరణ పొందాయి.