Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల సినిమాల ప్రమోషన్ల తీరు చాలా మారింది. తమ సినిమాలకు సంబంధించి ప్రతీ అప్డేట్ని ఎప్పటికప్పుడు అటు అభిమానులకు, ఇటు ప్రేక్షకులకు తెలియజేస్తూ సదరు సినిమాపై అందరిలోనూ మరింత క్యూరియాసిటీని మేకర్స్ రైజ్ చేస్తున్నారు. ఇదే పంథాని 'బంగార్రాజు' టీమ్ కూడా తూ.చ.తప్పకుండా పాటిస్తోంది. సరికొత్త అప్డేట్లతో హల్చల్ చేస్తోంది.
ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి 'నా కోసం..' అంటూ సాగే పల్లవిగల లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం ఆదివారం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'తన ప్రేయసి కతి శెట్టి కోసం నాగ చైతన్య ఎంతలా తనని తాను మార్చుకున్నాడో ఈ పాటలో అద్భుతంగా చూపించారు. ఆద్యంతం విజువల్ ట్రీట్‌గా ఉండటంతోపాటు అనూప్ రూబెన్స్ అందించిన మంచి మెలోడీ ట్యూన్, సిధ్ శ్రీరామ్ గాత్రం అందర్నీ మెస్మరైజ్ చేస్తోంది. అలాగే నాగ చైతన్య, కతి శెట్టిల మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. దీంతోపాటు పాట చివర్లో నాగ చైతన్య, కతి శెట్టిలతోపాటు నాగార్జున, రమ్యకష్ణ మెరవటం హైలైట్‌గా నిలిచింది. అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా 'మనం'. అందులో నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతున్న ఈ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్‌పై ఈ చిత్రాన్ని నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను సమకూర్చగా, యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు' అని తెలిపారు.