Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'శ్యామ్ సింగ రారు'. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ సంకత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 7న సినీ గేమ దిగ్గజం 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి రాసిన పాటను చిత్రయూనిట్ విడుదల చేయబోతోంది. ఈ పాట సిరివెన్నెల రాసిన చివరి పాట కావడంతో ఈ పాట ఎంతో ప్రత్యేకతను సంతరించుకుందని, అన్నింటికిమించి ఎంతో ఎమోషనల్ ఎటాచ్మెంట్ ఉందని మేకర్స్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ పాటకు ఎంత ప్రాముఖ్యత ఉందనే విషయాన్ని హీరో నాని, దర్శకుడు రాహుల్ సంకత్యాన్ వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. రాహుల్ సంకత్యాన్ మాట్లాడుతూ, 'నవంబర్ 3న సిరివెన్నెలగారు కాల్ చేశారు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో పాటను పూర్తి చేయలేకపోతున్నాను అని అన్నారు. ఎలాగైనా సరే పాటను పూర్తి చేయండని మేం ఎంతో రిక్వెస్ట్ చేశాం. ఆ తెల్లారే ఆయన ఫోన్ చేసి మమ్మల్ని నిద్రలేపారు. ఆ రోజు దీపావళి. పల్లవి చెబుతాను రాసుకోండి అని అన్నారు. మహాభారతం బుక్పైన ఆరులైన్లు రాశాను.. అందులోని ఓ లైన్లో సిరివెన్నెల అని ఉంది. ఆయన నవ్వుతూ ఇదే నా చివరి పాట అవుతుందేమోనని అన్నారు. విధి అంటే ఇదేనేమో. ఆయన అంత్యక్రియలు జరిగిన రోజే ఆ పాటను రికార్డ్ చేశాం' అని భావోద్వేగభరితంగా చెప్పారు. 'సిరివెన్నెల అనే పాట ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే లెజెండ్ సిరివెన్నెల రాసిన చివరి పాట అది. ఆయన మరోపాటను కూడా రాశారు. దాన్ని కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాం. ఈ సినిమాని సిరివెన్నెల గారికి అంకితం ఇస్తున్నాం' అని హీరో నాని తెలిపారు.
''సిరివెన్నెల' పాటకు మిక్కీ జే మేయర్ క్లాస్ ట్యూన్ ఇచ్చారు. అనురాగ్ కులకర్ణి అద్భుతంగా ఆలపించారు. సాంగ్ ప్రోమోను విడుదల చేస్తున్నాం. పూర్తి పాట కావాలంటే మరో మూడు రోజులు ఎదురుచూడాల్సిందే' అని నిర్మాత అన్నారు.
సాయి పల్లవి, కతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందించారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం దక్షిణాదిన అన్ని భాషల్లో ఈనెల 24న విడుదల కానుంది.