Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన లఘు చిత్రం 'మనసానమః'. దషిక చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పథ్వీ శర్మ హీరోయిన్లుగా నటించారు. గజ్జల శిల్ప నిర్మాణంలో దర్శకుడిగా దీపక్ రెడ్డి తన తొలి ప్రయత్నంగా ఈ షార్ట్ ఫిల్మ్‌ని తెెరకెక్కించారు. గతేడాది యూట్యూబ్‌లో రిలీజైన ఈ లఘు చిత్రం బోల్డెన్ని ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై 900కు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెల్చుకుంది. ఆస్కార్, బప్టా లాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలకు క్వాలిఫై అయ్యింది. ఈ నెల10 నుంచి ఆస్కార్ క్వాలిఫై కోసం ఓటింగ్ జరగబోతుంది. ఈ సందర్భంగా సోమవారం ప్రసాద్‌ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు దీపక్ రెడ్డి మాట్లాడుతూ, 'ప్రేమ కథనే కొత్తగా ఎలా తెరకెక్కించాలని ఆలోచించినప్పుడు, కంప్లీట్ రివర్స్ స్క్రీన్‌ప్లేతో మ్యూజికల్‌గా చేద్దామని అనుకున్నాం. జాతీయంగా, అంతర్జాతీయంగా ఈ లఘు చిత్రానికి వందల అవార్డులు రావడం మాకెంతో ప్రోత్సాన్నిచ్చింది. ఈ నెల 10న ఆస్కార్ ఓటింగ్‌లోనూ విన్ అవుతామని ఆశిస్తున్నాం. త్వరలోనే ఫీచర్ ఫిల్మ్ చేయబోతున్నాను' అని తెలిపారు.
హీరో విరాజ్ అశ్విన్, హీరోయిన్ దషికచందర్, సినిమాటోగ్రాఫర్ రాజ్, సంగీత దర్శకుడు కమ్రాన్ తదితరులు ఈ లఘు చిత్రానికి సంబంధించి పలు విశేషాలతోపాటు తమ సంతోషాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు.