Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రానికి 'యశోద' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హరి - హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కష్ణప్రసాద్ మాట్లాడుతూ, 'సమంత ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమిది. బాలకష్ణగారితో 'ఆదిత్య 369'తోపాటు మరో మూడు సినిమాలు చేశాను. నానితో 'జెంటిల్మన్', సుధీర్‌బాబుతో 'సమ్మోహనం' నిర్మించాను. లేటెస్ట్గా సమంతతో ఈ సినిమా చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. థ్రిల్లర్ జానర్లో నేషనల్ లెవల్లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్న చిత్రమిది. సమంత క్రేజ్, పొటెన్షియల్, ఫ్యాన్ ఫాలోయింగ్‌కు తగ్గ కథ కుదిరింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో చిత్రీకరణ చేయడానికి ప్లాన్ చేశాం. మార్చితో చిత్రీకరణ పూర్తవుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు' అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి.