Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'లక్ష్య' ప్రీ రిలీజ్ వేడుకలో హీరో శర్వానంద్
స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగశౌర్య హీరోగా నటించిన చిత్రం 'లక్ష్య'. సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ నిర్మించారు.
ఈనెల 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా చిత్ర బృందం వైభవంగా నిర్వహించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పుల్లెల గోపీచంద్, శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ, 'ఇందులో నాగశౌర్య నాలుగు డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తాడు. ఈ సినిమా కోసం తను చాలా కష్టపడ్డాడు. డీఓపీ రామ్ ప్రతీ ఫ్రేమ్‌ని అద్భుతంగా చూపించారు. కాల భైరవ మంచి సంగీతాన్ని అందించారు. డైరెక్టర్‌కు ఏం చేయాలో చాలా క్లారిటీ ఉంటుంది. కేతిక శర్మ స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు' అని తెలిపారు.
'సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. 'సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్. ఇట్స్ ఏ జర్నీ' ఆ జర్నీయే ఈనెల 10వ తేదీన థియేటర్లలో చూసే 'లక్ష్య' సినిమా' అని డైరెక్టర్ సంతోష్ చెప్పారు.
దర్శకుడు శేేఖర్ కమ్ముల మాట్లాడుతూ, 'టీజర్, ట్రైలర్‌తో పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. స్పోర్ట్స్ నేపథ్యం, ఆర్చరీ సినిమా అవ్వడంతో సగం హిట్ అయింది. మంచి టేస్ట్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది. హార్డ్‌వర్క్‌తో నాగశౌర్య తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు' అని తెలిపారు. 'అందరి కష్టానికి తగ్గట్టుగా ఈ సినిమాకు మంచి ఫలితం రావాలి. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాతో సక్సెస్ అవ్వాలి' అని పుల్లెల గోపీచంద్ అన్నారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ, 'బాలయ్య 'అఖండ' సినిమాతో ఇండిస్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చారు. ఈ సినిమా హిట్ అనటంలో ఎలాంటి డౌట్ లేదు' అని చెప్పారు. 'నా నిర్మాతలు ఈ సినిమాకు పెద్ద బలం. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. మంచి కంటెంట్ ఉన్న కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం' అని హీరో నాగశౌర్య తెలిపారు.