Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రియా, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'గమనం' క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమాని ఈనెల 10న విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా హీరో శివ కందుకూరి మీడియాతో మాట్లాడుతూ, 'నా కెరీర్లో ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది. ఇందులోని పాత్ర కోసం క్రికెట్లో ట్రైనింగ్ తీసుకున్నాను. చారు హాసన్ వంటి సీనియర్స్‌తో నటించే అవకాశం రావడం ఎంతో అదష్ణం. ఇళయరాజా గారితో పని చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఆయన ఇచ్చిన బీజీఎం వల్ల కొన్సి సీన్స్ మరోస్థాయికి వెళ్లాయి. విజువల్ ట్రీట్‌గా ఉండటానికి బాబా గారు కారణం. డైలాగ్స్‌తో సాయిమాధవ్ బుర్రా అద్భుతంగా మలిచారు. మా నిర్మాతలు సినిమాకి ఏది కావాలంటే అది సమకూర్చారు. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ మంచి సినిమాని చూశామనే ఫీలింగ్‌తో బయటికి వస్తారు. ప్రస్తుతం 'మనుచరిత్ర', 'మీట్ క్యూట్' వెబ్ సిరీస్‌తోపాటు మరో రెండు సినిమాలకు సైన్ చేశా' అని చెప్పారు.