Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 25న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
రిలీజ్ డేట్‌ని ఎనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్లో రవితేజ స్టైలీష్ లుక్‌లో కనిపిస్తున్నారు. రైతులు, పోలీస్ అధికారులు కూడా ఈ పోస్టర్లో ఉన్నారు. అన్నింటికిమించి సమ్మర్ స్పెషల్‌గా వేసవి బరిలోకి ఈ సినిమా దిగుతోందని కూడా అర్థమవుతోంది. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ నటిస్తుండగా, వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రని పోషిస్తున్నారు.