Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ నటుడు గౌతమ్‌రాజు తనయుడు కృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కఠారికృష్ణ'. నూతన దర్శకుడు ప్రకాష్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నాగరాజు తిరుమలశెట్టి, పి.ఎ.నాయుడు సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంత్రి టి. హరీష్‌రావు ఈ చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మన తెలంగాణ బిడ్డ, కొడంగల్ నియోజకవర్గం మెట్లకుంట గ్రామానికి చెందిన, ప్రముఖ సాఫ్ట్వేర్ బిజినెస్‌మాన్ ఆలమయ్య నాయుడు నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని పి.ఎ.నాయుడు అనే స్క్రీన్ పేరుతో నిర్మించడం అభినందనీయం. పలు ప్రజా సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి గుర్తింపు పొందిన ఆయన ప్రేక్షకులకు మంచి సందేశాత్మక చిత్రాలు అందించాలనే లక్ష్యంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఇందులో భాగంగా ప్రముఖ హాస్యనటుడు గౌతమ్ రాజు తనయుడు కష్ణ హీరోగా నిర్మించిన ఈ సినిమా ఈనెల 10వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా అఖండ విజయం సాధించి పి.ఎ.నాయుడు భవిష్యత్తులోనూ మరిన్ని సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను. మంచి కంటెంట్ ఉన్న కథతో విడుదలవుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది' అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, జాతీయ బీసీ నాయకులు ఆర్. కష్ణయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతు రావు, ఉస్మానియా విద్యార్థి నాయకులు, ఇతర రాష్ట్ర నాయకులు 'కఠారి కష్ణ' చిత్ర బృందాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.