Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ కుమార్, నాగవంశీ కష్ణ, వికాస్ చంద్ర, ఉషా, ఏంజిల్, వషాలి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ప్రియతమా'. సంతోష్ పార్లవర్ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పులకుర్తి కొండయ్య నిర్మించారు. ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా వెరైటీ కథనంతో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 10న విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పులకుర్తి కొండయ్య మీడియాతో మాట్లాడుతూ, 'ముక్కోణ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ అలరించేలా ఉంటుంది. దర్శకుడు సంతోష్ పార్లవార్ చక్కని కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. డిఫరెంట్ ప్రేమకథతో యూత్నే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ చిత్రాన్ని ఆయన తీర్చిదిద్దారు. అలాగే సినిమాని స్టార్ట్ చేసిన దగ్గర్నుంచి మాకు పాజిటివ్ బజ్ రావడం చాలా సంతోషాన్నిచ్చింది. ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్, రవికుమార్ చౌదరిగారు కలిసి విడుదల చేసిన ట్రైలర్‌కు, లెజెండరీ డైరెక్టర్ బి.గోపాల్గారు విడుదల చేసిన పాటలకు ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వచ్చింది. దీంతో చిత్ర విజయంపై మాకు చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. ప్రస్తుతం సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మా చిత్రం ఇంత బాగా రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కతజ్ఞతలు. ఈనెల 10వ తేదీన చిత్రాన్ని భారీగా రిలీజ్ చేస్తున్నాం. అందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది' అని తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం: చైతన్య, సినిమాటోగ్రఫీ: ఆనేం వెంకట్, ఎడిటింగ్: బి. మహేంద్రనాథ్, పాటలు: సంతోష్ పార్లవార్, పులకుర్తి కొండయ్య, నవీన్ రాంపోగు, హర ఉప్పాడ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంతోష్ పార్లవార్.