Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కేజీఎఫ్', 'నారప్ప' చిత్రాల్లోని భిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు హీరో వశిష్ట సింహా బాగా దగ్గరయ్యారు. ఆయన నటించిన తాజా చిత్రం 'నయీం డైరీస్'. సీ.ఎ.వరదరాజు నిర్మించిన ఈ చిత్రానికి దాము బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ నెల 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మంగళవారం హీరో వశిష్ట సింహా మీడియాతో సంభాషించారు.
ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..'గాయకుడిగా, నటుడిగా, దర్శకుడి గానే కాకుండా డీవోపీ, ఎడిటింగ్ ఇలా... చాలా డిపార్ట్మెంట్స్లో పని చేశాను. యష్ సినిమాలో ఒక నెగిటివ్ రోల్లో నటించాను. ఆ పాత్రకు బాగా పేరొచ్చింది. అలా విలన్‌గా నా కెరీర్ మొదలైంది. ఆ తర్వాత చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తూ బిజీగా మారిన టైమ్‌లో నిర్మాత వరదరాజు, దర్శకుడు దాము బాలాజీ గారు 'నయీం డైరీస్' గురించి చెప్పారు. ఈ కథ నాకు బాగా నచ్చింది. ఈ కథ విన్నప్పుడు మనిషి ఇంత క్రూరంగా ఉంటాడా అనిపించింది. జీవితంలో ఎన్నో సాధిస్తాం. ఎంతో సంపాదిస్తాం. కానీ ఒక ఘటన ఎదురైనప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది తర్వాత భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. నయీం అనే మనిషి త్వరగా, గట్టిగా రియాక్ట్ అవుతాడు. తర్వాత ఏంటనేది ఆలోచించడు. ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు ఒక గ్యాంగ్‌స్టర్‌గా ఎదగడం సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. 'నారప్ప', 'కేజీఎఫ్' తర్వాత ఈ సినిమా చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. నయీం క్యారెక్టర్లో ఉన్న డెప్త్, ఇంటర్నల్ ఎమోషన్ నాకు బాగా నచ్చింది. ఇలాంటి పాత్రలు తరుచూ దొరకవు. ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంటుంది. క్రైమ్‌ను, ఎమోషన్‌ను దర్శకుడు బాలాజీగారు కొత్తగా చూపించారు. డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. దీన్ని కన్నడ, తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కించాం. సంపత్ నందిగారి 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఆయన నెక్ట్ మూవీ 'సింబా'తోపాటు, 'కేజీఎఫ్ 2'లోనూ మంచి క్యారెక్టర్లు చేస్తున్నాను' అని వశిష్ట సింహా చెప్పారు.